ఎందుకో ఏమిటో
తొలిసారి నా గుండెలో
నీ ఊసులే
మొదలాయేనే ఈ వేళా
ఎందుకో ఏమిటో
నిదురింక రాదేమిటో
కనుపాపలో
కల కాదుగా ఈ మాయా
ఎపుడు లేనిది
నాలో అలజడి
ఎవరు చెప్పలేదే ప్రేమని
ఎందుకో ఏమిటో
తొలిసారి నా గుండెలో
నీ ఊసులే
మొదలాయేనే ఈ వేళా
ప్రేమనే మాటకి
అర్ధమే నాకు రాదే
ఎవ్వరో చెప్పగా
ఇప్పుడే తెలిసేనే
నీ జతే చేరగా
నా కథే మారిపోయే
లోకమే బొత్తిగా
గుర్తుకే రాదులే
చినుకై చేరినా
వరదై పోయెనే
ఎవరు ఆపలేరే ప్రేమని
ఎందుకో ఏమిటో
తొలిసారి నా గుండెలో
నీ ఊసులే
మొదలాయేనే ఈ వేళా
గాలిలో వేలితో
ఆశలే రాసుకోనా
నీవనే ప్రేమని
శ్వాసగా పీల్చనా
నీటిలో నీడలో
నిన్నిలా చూసుకోనా
ఊహలో తేలుతూ
ఊసులే ఆడనా
లోకం ఎంతగా
మారిందే ఇలా
పగలే జాలువారే వెన్నెలా
ఎందుకో ఏమిటో
తొలిసారి నా గుండెలో
నీ ఊసులే
మొదలాయేనే ఈ వేళా