• Song:  Thodakotti
  • Lyricist:  Chandrabose
  • Singers:  Rajesh Krishnan,Udit Narayan

Whatsapp

తొడకొట్టి చెబుతున్నా తొలమాట జబ్బ చరిచి చెబుతున్నా భలే మాట రొమ్ము విరిచి చెబుతున్నా కాలు దున్ని చెబుతున్నా బల్ల గుద్ది చెబుతున్నా బంపరు మాట ప్రేమన్నది ప్రతి ఒక్కరు చదవాల్సిన బుక్కు ప్రేమన్నది ప్రతి ఒక్కరు తర్చాల్సిన మొక్కు ప్రేమన్నది రాజ్యాంగం మనకిచ్చిన హక్కు ఇదే తారక మంత్రం నేటి యువతకు సూత్రం ఇదే తారక మంత్రం నేటి యువతకు సూత్రం ఇదే తారక మంత్రం ఇది అక్షర సత్యం ఆడ రెండక్షరాలు మగ రెండే అక్షరాలు ఆడ మగ మధ్య పుట్టు ప్రేమే రెండక్షరాలు తప్పు రెండక్షరాలు ఒప్పు రెండు అక్షరాలు తప్పొప్పులు చేయించు ప్రేమే రెండక్షరాలు బాధ రెండక్షరాలు హాయి రెండక్షరాలు ఈ రెంటిని కలిగించు ప్రేమే రెండక్షరాలు ప్రేమన్నది ఫలి ఇస్తే పెళ్ళి రెండక్షరాలు ప్రేమన్నది వికటిస్తే పిచ్చి కూడా రెండక్షరాలే ఇదే తారక మంత్రం నేటి యువతకు సూత్రం ఇదే తారక మంత్రం నేటి యువతకు సూత్రం ఇదే తారక మంత్రం ఇది అక్షర సత్యం ప్రేమన్నది ఒక గ్రామం ప్రేమికులకు స్వగ్రామం ఎదిరించిన వాళ్ళతోటి చేస్తుందోయ సంగ్రామం ప్రేమన్నది పదో గ్రహం అందించును అనుగ్రహం అనుగ్రహమే పొందుటకు కావాలోయ నిగ్రహం ప్రేమన్నది ఒక దారం అన్నిటికది ఆధారం ప్రేమించిన హృదయాల్లో పూస్తుందోయ మందారం ప్రేముంటె సౌభాగ్యం లేకుంటే దౌర్భాగ్యం లవ్వాడుట ఆరోగ్యం ఆడకుంటే అదో అనారోగ్యం ఇదే తారక మంత్రం నేటి యువతకు సూత్రం ఇదే తారక మంత్రం నేటి యువతకు సూత్రం ఇదే తారక మంతం ఇది అక్షర సత్యం

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Todakotti chebuthunna tolamata jabba charichi chebuthunna bhale mata rommu virichi chebuthunna kalu dunni chebuthunna balla guddi chebuthunna bamparu mata premannadi prati okkaru chadavalsina bukku premannadi prati okkaru tharchalsina mokku premannadi rajyangam manakicchina hakku ide tharaka mantram neti yuvathaku sutram ide tharaka mantram neti yuvathaku sutram ide tharaka mantram idi aksara satyam Ada rendaksaralu maga rende aksaralu ada maga madhya puttu preme rendaksaralu thappu rendaksaralu oppu rendu Aksaralu thappoppulu cheyinchu preme rendaksaralu badha rendaksaralu hayi rendaksaralu i rentini kaliginchu preme rendaksaralu premannadi phali iste pelli rendaksaralu premannadi vikatiste picchi kuda rendaksarale ide tharaka mantram neti yuvathaku sutram ide tharaka mantram neti yuvathaku sutram ide tharaka mantram idi aksara satyam Premannadi oka gramam premikulaku svagramam edirinchina vallatoti chesthundoya sangramam premannadi pado graham andinchunu anugraham anugrahame pondutaku Kavaloya nigraham premannadi oka daram annitikadi adharam preminchina hr̥dayallo pusthundoya mandaram premunte saubhagyam lekunte daurbhagyam lavvaduta arogyam adakunte ado anarogyam ide tharaka mantram neti yuvathaku sutram ide tharaka mantram neti yuvathaku sutram ide tharaka mantham idi aksara satyam

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Okato Number Kurradu
  • Cast:  Rekha Vedavyasa,Taraka Ratna Ramarao
  • Music Director:  M M Keeravani
  • Year:  2002
  • Label:  Aditya Music