• Song:  Nuvvu chudu
  • Lyricist:  Chandrabose
  • Singers:  M.M Keeravani,Ganga

Whatsapp

నువ్వు చూడు చూడకపో నువ్వు చూడు చూడకపో నే చూస్తూనే ఉంటా మాటాడు ఆడకపో మాటాడుతునే ఉంటా ప్రేమించు మించకపో ప్రేమిస్తూనే ఉంటా నా ప్రాణం నా ధ్యానం నువ్వే లెమ్మంట నువ్వు చూడు చూడకపో నే చూస్తూనే ఉంటా నువ్వు తిట్టినా నీ నోటి వెంట నా పేరొచ్చిందని సంబరపడతా నువ్వు కొట్టినా నా చెంప మీద నీ గురుతాకటుందని సంతోషిస్తా మనసు పువ్వును అందించాను కొప్పులో నిలుపుకుంటావో కాలి కింద నలిపేస్తావో వలపు గువ్వను పంపించాను బొట్టు పెట్టి రమ్మంటావో గొంతు పట్టి గెంటేస్తావో ఏం చేసినా ఎవరాపినా చేసేది చేస్తుంటా నువ్వు చూడు చూడకపో నే చూస్తూనే ఉంటా మాటాడు ఆడకపో మాటాడుతునే ఉంటా పూజించటం పూజారి వంతు వరమివ్వడమన్నది దేవత ఇష్టం ప్రేమించటం ప్రేమికుడి వంతు కరుణించడమన్నది ప్రేయసి ఇష్టం ఎందువల్ల నిను ప్రేమించిందో చిన్ని మనసుకే తెలియదుగా నిన్ను మరవడం జరగదుగా ఎందువల్ల నువు కాదన్నానో ఎదురు ప్రశ్నలే వెయ్యనుగా ఎదురు చూపులే ఆపనుగా ఏనాటికో ఒకనాటికి నీ ప్రేమ సాధిస్తా నిను చూడలని ఉన్నా నిను చూడలని ఉన్నా నే చూడలేకున్నా మాటాడాలని ఉన్నా మాటాడలేకున్నా ప్రేమించాలని ఉన్నా ప్రేమించలేకున్నా లోలోనా నాలోనా కన్నీరవుతున్నా

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Nuvvu chudu chudakapo Nuvvu chudu chudakapo Ne chustune unta Matadu adakapo Mataduthune unta Preminchu minchakapo Premistune unta Na pranam na dhyanam Nuvve lemmanta Nuvvu chudu chudakapo Ne chustune unta Nuvvu tittina ni noti venta Na perocchindani sambarapadatha Nuvvu kottina na chempa mida Ni guruthakatundani santosistha Manasu puvvunu andinchanu Koppulo nilupukuntavo Kali kinda nalipesthavo Valapu guvvanu pampinchanu Bottu petti rammantavo Gonthu patti gentesthavo Em chesina evarapina Chesedi chesthunta Nuvvu chudu chudakapo Ne chustune unta Matadu adakapo Mataduthune unta Poojinchatam pujari vanthu Varamivvadamannadi devatha istam Preminchatam premikudi vanthu Karuninchadamannadi preyasi istam Enduvalla ninu preminchindo Chinni manasuke teliyadu ga Ninnu maravadam jaragadu ga Enduvalla nuvu kadannano Eduru prasnale veyyanuga Eduru chupule apanuga Enatiko okanatiki Ni prema sadhistha Ninu chudalani unna Ninu chudalani unna Ne chudalekunna Matadalani unna matadalekunna Preminchalani unna Preminchalekunna Lolona nalona kanniravuthunna

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Okato Number Kurradu
  • Cast:  Rekha Vedavyasa,Taraka Ratna Ramarao
  • Music Director:  M M Keeravani
  • Year:  2002
  • Label:  Aditya Music