• Song:  Kannula Logililo
  • Lyricist:  Sirivennela Seetharama Sastry
  • Singers:  Unni Krishnan,K.S. Chitra

Whatsapp

కన్నుల లోగిలిలో వెన్నెల విరిసింది చల్లని జాబిలితో స్నేహం కుదిరింది చెలిమి తోడుంటే చాలమ్మ లేనిది ఏముంది ఆశ చిటికేస్తే చాలమ్మ అందనిదేముంది కన్నుల లోగిలిలో వెన్నెల విరిసింది చల్లని జాబిలితో స్నేహం కుదిరింది గున్నమావి గొంతులో తేనె తీపి నింపుతూ కోయిలమ్మ చేరుకున్నది ఎండమావి దారిలో పంచదార వాగుల కొత్త పాట సాగుతున్నది ఒంటరైన గుండెల్లో ఆనందాల అందెలతో ఆడే సందడిది అల్లిబిల్లి కాంతులతో ఏకాంతల చీకటిని తరిమే బంధమిది కలతేరగని కళలను చూడు కంటికి కావలి నేనుంటా కలతరగని వెలుగులు నేడు ఇంటికి తోరణమనుకుంటా కన్నుల లోగిలిలో వెన్నెల విరిసింది చల్లని జాబిలితో స్నేహం కుదిరింది పంచుకున్న ఊసులు పెంచుకున్న ఆశలు తుళ్ళి తుళ్ళి ఆడుతున్నవి కంచె లేని ఊహలే పంచ వన్నె గువ్వలై నింగి అంచు తాకుతున్నవి కొత్త జల్లు కురిసింది బ్రతుకే చిగురు తొడిగేలా వరమై ఈ వేళా వానవిల్లు విరిసింది మిన్ను మన్ను కలిసేలా ఎగసే ఈ వేళా అణువణువును తడిపిన ఈ తడి అమృతవర్షిణి అనుకొన్నా అడుగడుగునా పచ్చని బాటను పరిచిన వనమును చూస్తున్న కన్నుల లోగిలిలో వెన్నెల విరిసింది చల్లని జాబిలితో స్నేహం కుదిరింది చెలిమి తోడుంటే చాలమ్మ లేనిది ఏముంది ఆశ చిటికేస్తే చాలమ్మ అందనిదేముంది

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Kannula Logililo Vennela Virisindi Challani Jaabilitho Sneham Kudirindi Chelimi Thodunte Chaalamma Lenidi Emundi Aasa Chitikesthe Chaalamma Andanidemundi Kannula Logililo Vennela Virisindi Challani Jaabilitho Sneham Kudirindi Gunnamaavi Gonthulo Thene Theepi Nimputhu Koyilamma Cherukunnadi Endamaavi Daarilo Panchadaara Vaagula Kotha Paata Saaguthunnadi Vontaraina Gundello Aanandala Andhelatho Aade Sandadidi Allibilli Kaanthulatho Yekaanthala Cheekatini Tharime Bandhamidi Kalatheragani Kalalanu Choodu Kantiki Kaavali Nenuta Kalatharagani Velugulu Nedu Intiki Thoranamanukunta Kannula Logililo Vennela Virisindi Challani Jaabilitho Sneham Kudirindi Panchukunna Oosulu Penchukunna Aasalu Thulli Thulli Aaduthunnavi Kanche Leni Oohale Pancha Vanne Guvvalai Ningi Anchu Thaakuthunnavi Kottha Jallu Kurisindi Brathuke Chiguru Thodigela Varamai Ee Vela Vaanavillu Virisindi Minnu Mannu Kalisela Egase Ee Vela Anuvanuvunu Thadipina Ee Thadi Amruthavarshini Anukona Adugaduguna Pachani Baatanu Parichina Vanamunu Choosthunna Kannula Logililo Vennela Virisindi Challani Jaabilitho Sneham Kudirindi Chelimi Thodunte Chaalamma Lenidi Emundi Aasa Chitikesthe Chaalamma Andanidemundi

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Raja
  • Cast:  Soundarya,Venkatesh
  • Music Director:  S. A. Rajkumar
  • Year:  1999
  • Label:  Aditya Music