కన్ను కన్ను కలుపుకొని ఎన్నో ఎన్నో కలలుగని
కన్ను కన్ను కలుపుకొని ఎన్నో ఎన్నో కలలుగని
ఆ కలనై సాగాలి ఆకాశం దాటాలి
గువ్వల్లా ముద్దు రివ్వు రివ్వు
రివ్వంటుంటే తారాగణం
మాకందిస్తుంది నీరాజనం
కన్ను కన్ను కలుపుకొని ఎన్నో ఎన్నో కలలుగని
పొదరిల్లు పూలు పళ్ళు సెలయేర్లు హరివిల్లులు
లేడ్లు కుందేళ్లు నిల్లుంటే చాలు
స్వర్గంలో సంసారం స్వప్నాలే సంతానం
ఆ జాబిలి మా నెచ్చెలి ఈ కౌగిలీ మా లోగిలి
చిక్కిలి గింతల చుట్టాలు కందిన గుర్తులు కష్టాలు
ప్రణయాలే మా పాటలు
కన్ను కన్ను కలుపుకొని ఎన్నో ఎన్నో కలలుగని
చైత్రాలు సంగీతాలు సరదాలు సందేళ్లు
మా దేశంములో సిరులు సంపదులు
ముచ్చట్లే రత్నాలు మురిపాలే వరహాలు
ముత్తాటలే ముప్పూటలూ ముత్యాలయే ముచ్చమటలు
అల్లరి చిందులే నాట్యాలు తుంటరి నవ్వులే గానాలు
వలపింత మా ఆటలు
కన్ను కన్ను కలుపుకొని ఎన్నో ఎన్నో కలలుగని
కన్ను కన్ను కలుపుకొని ఎన్నో ఎన్నో కలలుగని
ఆ కలనై సాగాలి ఆకాశం దాటాలి
గువ్వల్లా ముద్దు రివ్వు రివ్వు
రివ్వంటుంటే తారాగణం
మాకందిస్తుంది నీరాజనం