ఏదో ఒప్పుకోనంది నా ప్రాణం
అది ఏదో చెప్పలేనంది ఏ వైనం
కలత పడుతుందే లో లో న
కసురుకుంటోందే నాపైన
తన గుబులు నేను నా దిగులు తానూ
కొంచమైనా పంచుకుంటే తీరిపోతుందేమో భారం
ఏదో ఏదో ఏదో ఒప్పుకోనంది నా ప్రాణం
అది ఏది చెప్పలేనంది ఏ వైనం
పచ్చగా ఉన్న పూ తోట నచ్చడం లేదే ఈ పూట
మెచ్చుకుంటున్న ఊరంతా గిచ్చినట్టుందే నన్నంత
పచ్చగా ఉన్న పూ తోట నచ్చడం లేదే ఈ పూట
మెచ్చుకుంటున్న ఊరంతా గిచ్చినట్టుందే నన్నంత
ఉండలేను నెమ్మది గా ఎందుకంట తెలియదు గా
ఉండలేను నెమ్మది గా ఎందుకంట తెలియదు గా
తప్పటడుగో తప్పు అనుకో తప్పదే తప్పుకు పోదాం
తక్షణం
అంటూ పట్టుపడుతోంది ఆరాటం
పదమంటూ నెట్టుకెళుతుంది నను సైతం