అమ్మాయి అచ్చ తెలుగు సాంప్రదాయ సుందరి
సౌభాగ్య లక్ష్మి పోలిక
అబ్బాయి మాటకారి మోహనాంగుడే మరి
తానున్న చోటే వేడుక
చూసేటి కళ్ళకెంత చూడ ముచ్చట
ముద్దైనా జంట విరట
ప్రేమన్న ఊహ కూడా లేదు ఇచ్చట
ఉందల్లా స్నేహమేనట
జత గువ్వలై రివ్వు రివ్వున
కోన సాగింది ఇరువురి పరిచయం
భల్లే భల్లే భల్లే భల్లే బాగుందిలే
ఈ రెండు మనసుల కూడిక
మాయే చేసిందిలే మంత్రం వేసిందిలే
మలయాళ కేరళ వేదిక
ఓ మాట చాలదా తియ్య తియ్యగా
ఏకాంతమే దరి రాదు కదా
మోమాటమొదిలితే కాస్త చనువుగా
మనసు మనసును ఆక్రమించదా
ఏ రుచి అభిరుచి ఏమి కలిసేనో
కొబ్బరి గాలుల వాలుగా
ఏమది ఎదురుగా ఏమి చదివేనో
సమయాలు వెలిగాయి సరదాలుగా
భల్లే భల్లే భల్లే భల్లే బాగుందిలే
ఈ రెండు మనసుల కూడిక
మాయే చేసిందిలే మంత్రం వేసిందిలే
మలయాళ కేరళ వేదిక
గడియారం చూసుకొని కాలక్షేపమే
గడియైన విడిపోనే పోదట
జరిగింది అందమైన ఇంద్రజాలమే
దైవికమైన అనుభందమేనట
నిన్నల్లో కలిసిన వారువీరిక
వారే వీరైనారట
ఎవరు ఎవరో పోల్చలేమిక
అంతగా ఒకటైపోయారట
భల్లే భల్లే భల్లే భల్లే బాగుందిలే
ఈ రెండు మనసుల కూడిక
మాయే చేసిందిలే మంత్రం వేసిందిలే
మలయాళ కేరళ వేదిక
భల్లే భల్లే భల్లే భల్లే బాగుందిలే
భల్లే భల్లే భల్లే భల్లే బాగుందిలే
భల్లే భల్లే భల్లే భల్లే బాగుందిలే
భల్లే భల్లే భల్లే భల్లే బాగుందిలే