• Song:  Raalipoye Puvva
  • Lyricist:  Veturi Sundararama Murthy
  • Singers:  M.M Keeravani

Whatsapp

రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే తోటమాలి నీ తోడు లేడు లే వాలిపోయే పోద్దా నీకు వర్ణాలెందుకే లోకమెన్నడో చీకటాయెలే నీకిది తెల్లవారని రెయమ్మ కలికి మా చిలక పాడకు నిన్నటి నీ రాగం రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే తోటమాలి నీ తోడు లేడు లే వాలిపోయే పోద్దా నీకు వర్ణాలెందుకే లోకమెన్నడో చీకటాయెలే చెదిరింది నీ గూడు గాలిగా చిలక గోరింకమ్మ గాధగా చిన్నారి రూపాలు కన్నీటి దీపాలు కాగా తనవాడు తారల్లో చేరగా మనసు మాంగల్యాలు జారగ సింధుర వర్ణాలు తెల్లారి చల్లారిపోగా తిరిగే భూమాతవు నీవై వేకువలో వెన్నెలవై కరిగే కర్పూరము నీవై ఆశలకే హారతివై రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే తోటమాలి నీ తోడు లేడు లే వాలిపోయే పోద్దా నీకు వర్ణాలెందుకే లోకమెన్నడో చీకటాయెలే అనుబంధమంటేనే అప్పులే కరిగే బంధాలన్నీ మబ్బులే హేమంత రాగాల చేమంతులే వాడిపోయే తన రంగు మార్చింది రక్తమే తనతో రాలేనంది పాశమే దీపాల పండక్కి దీపాలే కొండెక్కిపోయే పగిలే ఆకాశం నీవై జారిపడే జాబిలివై మిగిలే ఆలాపన నీవై తీగ తెగే వీణియవై రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే తోటమాలి నీ తోడు లేడు లే వాలిపోయే పోద్దా నీకు వర్ణాలెందుకే లోకమెన్నడో చీకటాయెలే

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Raalipoye puvva neeku raagalenduke Thotamaali nee todu ledu le Vaalipoye podda neeku varnaalenduke Lokamennado cheekatayele Neekidi tellavaarani reyamma Kaliki ma chilaka paadaku ninnati nee raagam Raalipoye puvva neeku raagalenduke Thotamaali nee todu ledu le Vaalipoye podda neeku varnaalenduke Lokamennado cheekatayele Chedirindi nee guudu gaaliga Chilaka gorinkamma gaadhaga Chinnari roopalu kanneti deepaalu kaagaa Tanavaadu taarallo cheraga Manasu maangalyaalu jaaraga Sindhuura varnaalu tellari challaripogaa Tirige bhuumaatavu neevai Vekuva lo vennelavai Karige karpuuramu neevai Aasalake haarativai Raalipoye puvva neeku raagalenduke Thotamaali nee todu ledu le Vaalipoye podda neeku varnaalenduke Lokamennado cheekatayele Anubandhamantene appule Karige bandhaalanni mabbule Hemanta raagaala chemantule vaadipoye Tana rangu maarchindi raktame Tanato raalenandi paasame Deepaala pandakki deepaale kondekkipoye Pagile aakasam neevai Jaaripade jabilivai Migile aalapana neevai Teega tege veeniyavai Raalipoye puvva neeku raagalenduke Thotamaali nee todu ledu le Vaalipoye podda neeku varnaalenduke Lokamennado cheekatayele

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Matrudevobhava
  • Cast:  Madhavi,Nassar
  • Music Director:  M M Keeravani
  • Year:  1993
  • Label:  Volga Music