• Song:  Mi prema kore
  • Lyricist:  Jonnavittula Ramalingeswara Rao
  • Singers:  K.S. Chitra,Swarnalatha

Whatsapp

మీ ప్రేమ కోరే చిన్నారులం మీ ఒడిన ఆడే చందమామలం మీ ప్రేమ కోరే చిన్నారులం మీ ఒడిన ఆడే చందమామలం గోరుముద్దలెరుగని బాలకృష్ణులం భాద పైకి చెప్పలేని బాల ఏసులం ఆలోచించండి ఓ అమ్మానాన్నా ఏం చెప్పగలం మీకు ఇంతకన్నా మీ ప్రేమ కోరే చిన్నారులం మీ ఒడిన ఆడే చందమామలం కమ్మగా మా అమ్మచేతితో ఏ పూట తింటాము ఏడాదిలో చక్కగా మా నాన్న పక్కగా సరదాగా తిరిగేది ఏ నాటికో పొద్దున్నే పరుగున వెళతారు రాతిరికి ఎపుడో వస్తారు మరి మరి అడిగినా కథలు చెప్పరు మేమేం చెప్పినా మనసుపెట్టరు అమ్మ నాన్న తీరు మాకు అర్థమవ్వదు ఏమి చేయాలో మాకు దిక్కుతోచదు ఆలోచించండి ఓ అమ్మానాన్నా ఏం చెప్పగలం మీకు ఇంతకన్నా మీ ప్రేమ కోరే చిన్నారులం మీ ఒడిన ఆడే చందమామలం పిల్లలం మీ చేతి ప్రమిదలం మీ ప్రేమ చమురుతో వెలుగు దివ్వెలం పువ్వులం మీ ఇంటి నవ్వులం మీ గుండెపై ఆడు చిన్ని గువ్వలం కనిపించే మీరే దేవుళ్ళు కనిపించే శివుడు పార్వతులు లోకం బూచికి మా గుండె వణికితే మాకు ధైర్యమిచ్చేది మీ లాలింపే అమ్మనాన్నలిద్దరూ వేరు వేరయి అనాధలను చేయకండి పసిపిల్లలని ఆలోచించండి ఓ అమ్మానాన్నా ఏం చెప్పగలం మీకు ఇంతకన్నా మీ ప్రేమ కోరే చిన్నారులం మీ ఒడిన ఆడే చందమామలం

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Mi prema kore chinnaarulam Mi odina aade chamdamaamalam Mi prema kore chinnaarulam Mi odina aade chamdamaamalam Gorumuddalerugani baalakrushnulam Bhaada paiki cheppaleni baala esulam Aalochinchandi O ammaanaannaa EM cheppagalam miku imtakannaa Mi prema kore chinnaarulam Mi odina aade chamdamaamalam Kammagaa maa ammachetito E puta timtaamu edaadilo Chakkagaa maa naanna pakkagaa Saradaagaa tirigedi E naatiko Poddunne paruguna velataaru Raatiriki epudo vastaaru Mari mari adiginaa kathalu chepparu Memem cheppinaa manasupettaru Amma naanna tiru maaku arthamavvadu Emi cheyaalo maaku dikkutochadu Aalochimchamdi O ammaanaannaa EM cheppagalam miku imtakannaa Mi prema kore chinnaarulam Mi odina aade chamdamaamalam Pillalam mi cheti pramidalam Mi prema chamuruto velugu divvelam Puvvulam mi imti navvulam Mi gumdepai aadu chinni guvvalam Kanipimche mire devullu Kanipimche shivudu paarvatulu Lokam buchiki maa gumde vanikite Maaku dhairyamicchedi mi laalimpe Ammanaannaliddaru veru verayi Anaadhalanu cheyakamdi pasipillalani Aalocimchamdi O ammaanaannaa EM cheppagalam miku imtakannaa Mi prema kore chinnaarulam Mi odina aade chamdamaamalam

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Devullu
  • Cast:  Baby Nitya,Master Nandan
  • Music Director:  Vandemataram Srinivas
  • Year:  2000
  • Label:  Aditya Music