కదులు కదులు కదులు కట్లు తెంచుకొని కదులు
వదులు వదులు వదులు బానిస సంకెళ్ళను వదులు
కాలం తన కళ్ళు తెరిచి గాలిస్తున్నది నీలో
కాళిక ఏమైందని ఉగ్రజ్వాలిక ఏమైందని
దెబ్బకొడితే పులిని నేను ఆడదాన్ననుకున్నా
తోక తొక్కితే నాగు తనను ఆడదనుకుంటుందా
ఓ ఓఓ ఓ ఓ ఓఓ ఓ ఓ ఓఓ ఓ
ఓ ఓఓ ఓ ఓ ఓఓ ఓ ఓ ఓఓ ఓ
కదులు కదులు కదులు కట్లు తెంచుకొని కదులు
వదులు వదులు వదులు బానిస సంకెళ్ళను వదులు
గాజుతో గాయాలు చెయ్
చున్నీనే ఉరి తాడు చెయ్
రంగులు పెట్టే గొల్లనే గుచ్చే బాకులు చెయ్
పిరికితనం ఆవహించి పరిగెత్తే నీ కాళ్ళతో
రెండు తొడల మధ్య తన్ని నరకం పరిచయం చెయ్
నీ శరీరమే నీకూ ఆయుధ కర్మాగారం
బతుకు సమర భూమిలో నీకు నీవే సైన్యం సైన్యం సైన్యం
ఓ ఓఓ ఓ ఓ ఓఓ ఓ ఓ ఓఓ ఓ
ఓ ఓఓ ఓ ఓ ఓఓ ఓ ఓ ఓఓ ఓ
కదులు కదులు కదులు కట్లు తెంచుకొని కదులు
వదులు వదులు వదులు బానిస సంకెళ్ళను వదులు