ఉండిపోవా ఉండిపో ఇలాగా
తోడుగా నా మూడు ముళ్ళలాగా
నిండిపోవా నీడలాగా నీలాగా
ఉండి రెండుగానే ఒక్కటైన ముడిలాగా
ఉండి రెండుగానే ఒక్కటైన ముడిలాగా
విడివిడిగానే అడుగులు ఉన్నా
విడిపడలేని నడకలలాగా
ఎవరు రాయని ప్రేమకధ ఇది
మొదలు మనమని నిలబడిపోగా
సువ్వి సువ్వి సువ్వాలా
సూదంటు రాయే పిల్ల
మళ్లీ మళ్లీ చూసేలా
చేసిందే మాయే ఇల్లా
సువ్వి సువ్వి సువ్వాలా
సూదంటు రాయే పిల్ల
మళ్లీ మళ్లీ తలచేలా
నచ్చావే చాలా చాలా
ఉండిపోవా ఉండిపో ఇలాగా
తోడుగా నా మూడు ముళ్ళలాగా
నిండిపోవా నీడలాగా నీలాగా
ఉండి రెండుగానే ఒక్కటైన ముడిలాగా
నిదుర సరిపోని కలతలకి
బదులు విసిరేటి నవ్వులకి
నిజములా కలలే మారుతుంటే
సమయం అసలే చాలదే
ఇక చివరే లేదను ప్రేమ మనదని
మనసు తెలిపిన తరుణమిలాగా
సువ్వి సువ్వి సువ్వాలా
సూదంటు రాయే పిల్ల
మళ్లీ మళ్లీ చూసేలా
చేసిందే మాయే ఇల్లా
సువ్వి సువ్వి సువ్వాలా
సూదంటు రాయే పిల్ల
మళ్లీ మళ్లీ తలచేలా
నచ్చావే చాలా చాలా
ఉండిపోవా ఉండిపో ఇలాగా
తోడుగా నా మూడు ముళ్ళలాగా
నిండిపోవా నీడలాగా నీలాగా
పోవా నీడలాగా నీలాగా
ఉండి రెండుగానే ఒక్కటైన ముడిలాగా
రెండుగానే ఒక్కటైన ముడిలాగా