మొదటిసారిగా చూపు తగిలే
గుండెల్లో మోగిందే నీ తొలి కబురే
మనసు వింతగా మాట వినదే
గల్లంతై పోయిందే ఊహలు మొదలే
సరిహద్ధుల్లో తను నిలబడననదే
కంగారుగా మది అటూ ఇటూ తిరిగే
ఈ యుద్ధంలో గెలుపెవరిది అనరే
సంకెళ్లు తీసిన ప్రేమదే కదే
తూటలే పేలుస్తుంటే
నీ చిరు నగవే
అందాల గాయం తగిలే నా ఎదకే
మౌనాల మరణమిదే
జూము జూమురే
గుండెల్లోన యుద్ధాలే
సిద్ధంగా ఉంచా నీకే
ఏడు జన్మలే
జూము జూమురే
అదృష్టం నా సొంతూరే
నీ పేరు చివరన నేను చేరితే
నా కళ్ళలోన తదేకంగా చూసే
పనే మానుకోవా ఓ సుందరా
నీ ఊహలోన ఏమి జరుగుతోందో
కనపడుతోంది ఏం తొందర
నను కలుసుకున్న
కథ మలుపు నీవని
తెలిసి రభస ఇదీ
ఇక నిమిషమైనా నిను
విడిచి ఉండని
మనసు గొడవ ఇదే
పగటి వెన్నెల మంచు తెరలా
నా చుట్టు అల్లిందే ఊహలు మొదలే
మొదటి శ్వాసలా గాలి అలల
నన్నొచ్చి తాకింది నీ తొలి పిలుపే
విధ్వంసంలో ఒక తెలియని హాయి
నీవల్లే చేరెను నీకిది తెలుసా
పూ వర్షంలా నను తడిమిన మాయే
నీ నవ్వే అన్నది నమ్ముతావుగా
అందాల విస్ఫోటనంలా
నువ్వు నన్ను దొలిచే
కల్లోలం సృష్టించావుగా ఓ మగువా
మౌనాల మరణమిదే
జూము జూమురే
నీకోసం నే తయ్యారే
సిద్ధంగా ఉంచా నీకే
ఏడు జన్మలే
జూము జూమురే
అదృష్టం నా సొంతూరే
నీ పేరు చివరన నేను చేరితే