రామ రామ రామా
నీలీ మేఘ శ్యామా
రామ రామ రామా
నీలీ మేఘ శ్యామ
రావా రఘుకుల సోమా
భద్రాచల శ్రీరామా
మా మనసూ విరబూసే
ప్రతి సుమగానం నీకేలే
కరుణించీ కురిపించే
నీ ప్రతి దీవెన మాకేలే
నిరతం పూజించే మాతో
దాగుడు మూతలు నీకేలా
రెప్పలు మూయక కొలిచామూ
కన్నుల ఎదుటకు రావేలా
రామ రామా
రామ రామ రామా
నీలీ మేఘ శ్యామా
రావా రఘుకుల సోమా
భద్రాచల శ్రీరామా