రంగ రంగ రంగస్థలాన
రాంగా రంగ రంగస్థలాన
(వినపడేట్లు కాదురా కనబడేట్టు కొట్టందేహే )
హే రంగ రంగ రంగస్థలాన
రంగు పూసుకోకున్న ఏసమేసుకోకున్నా
ఆట బొమ్మలం అంట
మనమంతా తోలు బొమ్మలం అంట
ఆట బొమ్మలం అంట
మనమంతా తోలు బొమ్మలం అంట
హే రంగ రంగ రంగస్థలంపై
ఆట మొదలెట్టాక మధ్యలోని ఆపలేని
ఆట బొమ్మలం అంట
మనమంతా తోలు బొమ్మలం అంట (x2)
కనపడని చెయ్యేదో ఆడిస్తున్న
ఆట బొమ్మలం అంట
ఇనపడని పాటకి సిందాడేస్తున్న
తోలు బొమ్మలం అంట
డుంగురు డుంగురు డుంగురు డుముకు
డుంగురు డుంగురు డుంగురు (x2)
రంగ రంగ రంగస్థలాన
రంగు పూసుకోకున్న ఏసమేసుకోకున్నా
ఆట బొమ్మలం అంట
మనమంతా తోలు బొమ్మలం అంట (x2)
హే గంగంటే శివుడి గారి పెళ్ళాం అంట
గాలంటే హనుమంతుడి నాన్న గారంటే
గాలి పీల్చడానికైనా గొంతు తడవడానికైనా
వాళ్ళు కనుకరించాలంటే
వేణువంటే కిట్టమూర్తి వాద్యం అంట
శూలమంటే కాలికమ్మ ఆయుధమంట
పాట పాడటానికైనా పోటు పొడవటానికైనా
వాళ్ళు ఆనతిస్తేనే అన్ని జరిగేవంట
రంగ రంగ రంగస్థలాన
రంగు పూసుకోకున్న ఏసమేసుకోకున్న
ఆట బొమ్మలం అంట
మనమంతా తోలు బొమ్మలం అంట (x2)
డుంగురు డుంగురు డుంగురు డుముకు
డుంగురు డుంగురు డుంగురు (x2)
పది తలలు ఉన్నోడు రావణుడంటా
ఒక్క తలపు కూడా చెడు లేదే రాముడి కంటా
రామ రావణుల బెట్టి రామాయణం ఆట గట్టి
మంచి చెడుల మధ్య మానని పెట్టారంటా
ధర్మాన్ని తప్పనోడు ధర్మరాజట
దయ లేని వాడు యమధర్మరాజట
వీడి బాట నడవకుంటే వాడి వేటు తప్పదంటూ
ఈ బ్రతుకుని నాటకంగా ఆడిస్తున్నారంట
రంగ రంగ రంగస్థలాన
ఆడాడానికంటే ముందు సాధనంటూ చెయ్యలేని
ఆట బొమ్మలం అంట
మనమంతా తోలు బొమ్మలం అంట (x2)
హే డుంగురు డుంగురు డుంగురు డుముకు
డుంగురు డుంగురు డుంగురు (x2)
ఆయా..