తెలుసా తెలుసా
ఎవ్వరికోసం ఎవ్వరు పుడతారో
ఎవరికి ఎవరేమి అవుతారో
తెలుసా తెలుసా
ఈ హృదయాలకు ఏ కథ రాసుందో
ఎవ్వరు చదవని కధనం ఏముందో
ఆడే పాడే వయసులలో
ముడే పడే ఓ రెండు మనసులు
పాలు నీళ్ళు వీళ్ళ పోలికలు
వేరే చేసి చూసే వీల్లేదంటారు
తెలుసా తెలుసా
ఎవ్వరికోసం ఎవ్వరు పుడతారో
ఎవరికి ఎవరేమి అవుతారో
కలిసే ఉంటున్నా కలవని కన్నుల్లా
కనిపిస్తూ ఉన్నా కలలే ఒకటంటా
పగలు రాతిరిలా పక్కనే ఉంటున్నా
వీళ్ళే కలిసుండే రోజే రాదంటా
తెలుసా తెలుసా
ఆ ఉప్పూ నిప్పులకన్నా
చిటపటలాడే కోపాలే వీల్లేనన్నా
ఒకరిని ఒకరు మక్కువగా
తక్కువగా చూసి పోటీ పెట్టావో
మరి వీళ్ళకు సాటే ఎవరూ రారంటా
తెలుసా తెలుసా
ఎవ్వరి కోసం ఎవ్వరు పుడతారో
ఎవరికి ఎవరేమి అవుతారో
చుట్టూ తారల్లా చుట్టాలుంటున్నా
భూమి చంద్రుల్లా వీళ్ళే వేరంటా
ముచ్చపు హారంలో రాయే రత్నంలా
ఎందరిలో ఉన్నా అస్సలు కలవరుగా
ఎదురెదురుండే ఆ తూర్పు పడమరలైన
ఏదో రోజు ఒకటయ్యే వీలుందంటా
పక్కనే ఉన్నా కలిసెల్లే దారొకటే అయినా
కానీ ఏ నిమిషం ఒక్కటిగా
పడని అడుగులు వీళ్ళంటా
తెలుసా తెలుసా
ఎవ్వరి కోసం ఎవ్వరు పుడతారో
ఎవరికి ఎవరేమి అవుతారో
తెలుసా తెలుసా
ఈ హృదయాలకు ఏ కథ రాసుందో
ఎవ్వరు చదవని కధనం ఏముందో