హే మీసాల పిల్లా
నీ ముక్కు మీద కోపం కొంచెం తగ్గాలే పిల్లా ఆ ఆ
మీసాల పిల్లా
నీ ముక్కు మీద కోపం కొంచెం తగ్గాలే పిల్లా
పొద్దున లేచిందగ్గర్నుంచి డైలీ యుద్ధాలా
మొగుడు పెళ్లాలంటేనే కంకి కొడవళ్ళా
అట్టా కన్నెర్ర జెయ్యలా కారాలే నూరేలా
ఇట్టా దుమ్మెత్తి పోయ్యలా దూరాలే పెంచేలా
కుందేలుకు కోపం వస్తే చిరుతకి చెమటలు పట్టేలా
నీ వేషాలు చాల్లే
నువ్ కాకా పడితే కరిగేటంత సీనే లేదులే
అందితే జుట్టు అందకపోతే కాళ్ళ బేరాలా
నువ్విట్టా ఇన్నోసెంటే ఫేసే పెడితే ఇంకా నమ్మాలా
ఓ బాబు నువ్వే ఇంతేనా
మగజాతి మొత్తం ఇంతేనా
గుండెల్లో ముల్లు గుచ్చి
పువ్వులు చేతికి ఇస్తారా
మీసాల పిల్లా
నీ ముక్కు మీద కోపం కొంచెం తగ్గాలే పిల్లా
వేషాలు చాల్లే
నువ్ కాకా పడితే కరిగేటంత సీనే లేదులే
మీసాల పిల్లా
ఆ ఎదురింటి ఎంకట్రావ్ కుళ్ళుకు సచ్చుంటాడు
పక్కింటి సుబ్బారావ్ దిష్టేట్టుంటాడు
ఈడు మట్టే కొట్టుకు పోను
వాడు యేట్లో కొట్టుకు పోనూ
ఆ ఏడు కొండల వెంకన్నా
నా బాధని చూసుంటాడు
శ్రీశైలం మల్లన్నా కరుణించుంటాడు
కనుకే నీతో కటయ్యాను
చాల హ్యాపీగుంటున్నాను
నువ్వింత హార్ష్‌గా మాటాడాలా
హార్ట్ హర్టై పోయేలా
ఏ తప్పు చెయ్యకుండా
భూమ్మీదా ఎవ్వరైనా ఉంటారా
నీ తప్పులు ఒకటా రెండా
చిత్రగుప్తుడి చిట్టాలా
హే మీసాల పిల్లా
నీ ముక్కు మీద కోపం కొంచెం తగ్గాలే పిల్లా ఆ ఆ
నీ వేషాలు చాల్లే
నువ్ కాకా పడితే కరిగేటంత సీనే లేదులే
రాజి పడదామంటే రావే మాజీ ఇల్లాలా
నువ్వు రోజు పెట్టే నరకంలోకి మళ్ళీ దూకాలా
అబ్బా పాతవన్నీ తోడాలా నా అంతు ఏదో చూడాలా
కలకత్తా కాళీమాత నీకు మేనత్త అయ్యేలా
హే మీసాల పిల్లా
నా మొహం మీద అన్ని సార్లు డోరే వెయ్యాలా
హాల్లో బాగా చలిగా ఉంది దుప్పటి కప్పండ్రా