• Song:  Cheppake
  • Lyricist:  Chaitanya Prasad
  • Singers:  Deepthi Parthasarathy

Whatsapp

చెప్పకే చెప్పకే ఊసుపోని మాటలు చాలులే వేలాకోలం ఊరుకో నేర్పకే నేర్పకే లేనిపోని ఆశలు మనసా మళ్ళీ రాకు వెళ్ళిపో ఎగసే కలలే అలలై ఎదనే ముంచేసేలే కదిలే కథలే కడలై ఉప్పెనల్లే ఊపేసేలే ఎందుకీ బంధాలన్నీ కలపకులే నిలపకులే గెంటేస్తాను గెంటేస్తాను నిన్నిక ఇపుడే మనసా కనబడితే ఎదురుగ నిలబడితే చంపేస్తాను చంపేస్తాను తొందరపడితే చల్లనైన చూపు నువ్వే మంచి గంధపు మాట నువ్వే ముళ్లకంచెలన్నీ తెంచి పూల బాటవయ్యావే మోయలేని హాయి నువ్వే నన్నే మార్చిన మాయ నువ్వే ముందు నువ్వు వెళ్తావుంటే వెంట నీడనయ్యానే వేసవి వేడిలో లేతగాలై వచ్చావే మమతే కురిసి మనసే తడిసెలే నువు నా జతగా ఉంటె బతికా నే ధైర్యమై తెలిసేనిపుడే ఇపుడే జీవితాన మాధుర్యమే వింతగా నన్నే నేను మరచితినే మురిసితినే నిన్నా లేని మొన్నా లేని వెన్నెల విరిసే మ్ మ్ మదికొక మది దొరికే కలతల కథ ముగిసే అంతే లేని సంతోషాల కాంతులు కురిసే నువ్వు నేను వేరు అన్నా నీవైపస్సలు చూడకన్నా దొంగలాగ కళ్ళే నిన్నే తొంగి తొంగి చూసాయే పగ్గమేసి ఆపుతున్నా ప్రేమే కాదిది స్వార్ధమన్నా సిగ్గులేని కళ్ళే నన్నే ముగ్గులోకి తోసాయే నా మదే ఈ విధి ప్రేమ మదే అయిందే కుదురే మరచి వరదై ఉరికెలే తపమే తపమై జపమై నిలిచా నీకోసమే జడిలా ముసిరే కసిరే జ్ఞాపకాల్ని తోసేసాలే ప్రేమకే రూపం నువ్వు అని తెలిసే మది మురిసే గుండె తీసి దండే చేసి రమ్మని పిలిచే ఎద ఇది నిలవదులే నిను ఇక వదలదులే ఆనందాల మహాసంద్రామాయను మనసే

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Cheppake Cheppake Oosuponi Maatalu Chaalule Velaakolam Ooruko Nerpake Nerpake Leniponi Aashalu Manasaa Mallee Raaku Vellipo Egase Kalale Alalai Yedhane Munchesele Kadhile Kathale Kadalai Uppenalle Oopesele Endhukee Bandhaalannee Kalapakule Nilapakule Gentesthaanu Gentesthaanu Ninnika Ipude Manasaa Kanabadithe Edhuruga Nilabadithe Champesthaanu Champesthaanu Thondarapadithe Challanaina Choopu Nuvve Manchi Gandhapu Maata Nuvve Mullakanchelannee Tenchi Poolabaatavayyaave Moyaleni Haayi Nuvve Nanne Maarchina Maaya Nuvve Mundhu Nuvvu Velthaavunte Venta Needanayyaane Vesavi Vedilo Lethagaane Vachhaave Mamathe Kurisi Manase Thadisele Nuvu Naa Jathagaa Unte Bathikaa Ne Dhairyamai Telisenipude Ipude Jeevithaana Maadhuryame Vinthagaa Nanne Nenu Marachithine Murisithine Ninnaa Leni Monnaa Leni Vennela Virise Mm Mm Madhikoka Madhi Dhorike Kalathala Katha Mugise Antheleni Satoshaala Kaanthulu Kurise Nuvvu Nenu Veru Annaa Neevaipassalu Choodakanaa Dongalaaga Kalle Ninne Thongi Thongi Choosaaye Paggamesi Aaputhunnaa Preme Kaadhidhi Swaarthamannaa Sigguleni Kalle Mugguloki Tosaaye Naa Madhe Ee Vidhi Preme Madhe Ayindhe Kudhure Marachi Varadhai Urikele Thapame Thapamai Japamai Nilichaa Neekosame Jadilaa Musire Kasire Ganapakaalni Tosesaale Premake Roopam Nuvvu Ani Telise Madhi Murise Gunde Teesi Dande Chesi Rammani Piliche Edha Idhi Nilavadhule Ninu Ika Vadhaladhule Aanandaala Mahasandhramaayanu Manase

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Maha Samudram
  • Cast:  Aditi Rao Hydari,Anu Emmanuel,Sharwanand,Siddharth
  • Music Director:  Chaitan Bharadwaj
  • Year:  2021
  • Label:  Sony Music