మాటలే రాని వేళ
పాట ఎలా పాడను
కంటిలో కడలిని ఇక
ఎంత సేపు ఆపను
ఓటమే వెంట ఉంటె
అడుగు ఎలా కదపను
కాలమే కాటు వేస్తే
ప్రాణం ఎలా నిలుచును
మట్టిలో కలిసే దేహమే ఇది
లేని పోనీ ఆశలు రేపిన విధి
పూజతో శాపం దక్కిందా ఓ
గుండెలో గాయం మిగిలిందా
మాటలే రాని వేళ
పాట ఎలా పాడను
కంటిలో కడలిని ఇక
ఎంత సేపు ఆపను
చిన్ననాటి నుండి నాకు
తోడు ఒక్కటే
నీడ లాగ వెంట ఉంది
కష్టం ఒక్కటే
చిన్ననాటి నుండి నాకు
తోడు ఒక్కటే
నీడ లాగ వెంట ఉంది
కష్టం ఒక్కటే
ఏడుపంటే కొత్తేమి కాదు
బాధ నాకు వింతేమీ కాదు
ఇపుడున్న గుండెకోత
ముందు ఎరుగను
చెప్పుకుంటే తగ్గేది కాదు
పంచుకునే తోడంటూ లేదు
అంతులేని దారిలోన
ఎంత నడవను
ఇది నాలో దోషమా
మరి దేవుని పాపమా
విధి ఆడే జూదమా
మనసంటే మాయేనా
మాటలే రాని వేళ
పాట ఎలా పాడను
కంటిలో కడలిని ఇక
ఎంత సేపు ఆపను
నాకు బాధ కలిగినపుడు
నువ్వు లాలనా
బొమ్మలాగ నువ్వు ఉంటె
దిక్కు తోచునా
నాకు బాధ కలిగినపుడు
నువ్వు లాలనా
బొమ్మలాగ నువ్వు ఉంటె
దిక్కు తోచునా
చల్లనైన నీ గుండెపైన
మాల లాగా నేనుండి పోయే
భాగ్యమింక జన్మలోన
నాకు లేదులే
జన్మ అంటూ ఇంకోటి ఉంటె
పువ్వునై నీ చెంత చేరి
నన్ను కడ తెరనివ్వు
పాద పూజలో
నా ప్రాణం నీవేరా
నా ధ్యానం నీవేరా
కృష్ణా కృష్ణా
కృష్ణా కృష్ణా