ఉన్నానా ఉన్నానా నేను నీలోనే ఉన్నానా
నాలోనే దాగున్న నిన్నే నే ప్రేమిస్తున్నానా
ఉన్నానా ఉన్నానా నేను నీలోనే ఉన్నానా
నాలోనే దాగున్న నిన్నే నే ప్రేమిస్తున్నానా
చనువే చల్లారినట్టు బరువే నా గుండె చుట్టూ
ఎంటో సరికొత్తగా ఉంధీ నీతో
పెదవే దాచేసి గుట్టు కనులే చదివేస్తున్నట్టు
ఎంతో తికమక ఉంది నాకు
కాలం ఓ ఓ పొడుపుకథలు విసిరిందిలే
మౌనం ఓ ఓ మనసుకే తెరలు వేసింది
ఉన్నానా ఉన్నానా నేను నీలోనే ఉన్నానా
నాలోనే దాగున్న నిన్నే నే ప్రేమిస్తున్నానా
ముగిసే కథలో మలుపే మలిచింది నీపై ఇష్టం
తెలిపే దారే లేక సతమతమౌతున్న నేస్తం
చేరదీసి చేరానన్న చూపుల్లో చేరేదెలా చేరేదెలా
భాషే లేని బంధాన్ని ముడివేసుకున్ననాడు
ధ్యాసే నువ్వై వస్తున్నా అడుగడుగు నీతో నేడు
నా నువ్వైతే అరనవ్వైనా అందిస్తావని చూస్తున్న
ఉన్నా ఉన్నా మాటే కలపొచ్చుకదా
ప్రాయం ఓ ఓ చిలిపి పరుగు తీసిందిలే
ప్రాణం ఓ ఓ నువ్వోద్దన్నా నీవెంటే వస్తుంది
ఉన్నానా ఉన్నానా నేను నీలోనే ఉన్నానా
నాలోనే దాగున్న నిన్నే నే ప్రేమిస్తున్నానా
ఎపుడు ఎక్కడో అపుడే అంతటితో సెలవనుకున్న
ఇదిగో ఇపుడే ఇక్కడే వెనువెంటే నడిచేస్తున్న
హత్తుకున్నా పొత్తు పేరు ప్రేమని తెలిసిందిలా
నమ్మేదెలా పెదవే దాటే నీ మాటే బరువెక్కి ఆపేస్తావో
హృదయం దాగే ఓ చోటే నీ చిత్రం ముద్రిస్తావో
ఉందొ లేదో తెలియని ప్రేమకు సతమతమైపోతున్నానా
నేనే నేనా నేనిపుడు నువ్వయ్యానా
దూరం ఓ ఓ ఒడ్డునుంటే తరిగేదెలా
తీరం ఓ ఓ చేరాలంటే అడుగైనా వెయ్యాలి