ఇల్లు పాయె ఒల్లు పాయె ఓ రామ రామ
గా లచ్చుగాని ఎచ్చులు పాయె ఓ రామ రామ
సెల్లు పాయె సిమ్ము పాయె ఓ రామ రామ
గా సూరిగాని సొల్లు పాయె ఓ రామ రామ
పువ్వు పాయె నవ్వు పాయె ఓ రామ రామ
గీ పొట్టిదాని లవ్వు పాయె ఓ రామ రామ
ముద్దు ముచ్చటంత పాయె మూతిపండ్లు రాలి పాయె
వామ్మో వాయ్యో ఒల్లెంకలో
నేనేంజేతు సొల్లెంకలో
అరె వామ్మో వాయ్యో ఒల్లెంకలో
నేనేంజేతు సొల్లెంకలో
గట్టు పాయె గెట్టు పాయె ఓ రామ రామ
నెత్తి మీద జుట్టు పాయె ఓ రామ రామ
సేను పాయె సిలక పాయె ఓ రామ రామ
సేతిలోన పలక పాయె ఓ రామ రామ
మన్ను పాయె ములక పాయె ఓ రామ రామ
సిలకలొచ్చి ఎగిరి పాయె ఓ రామ రామ
గిరక పాయె గిలక పాయె
నులకమంచం ఇరిగిపాయె
వామ్మో వాయ్యో ఒల్లెంకలో
నేనేంజేతు సొల్లెంకలో
అరె వామ్మో వాయ్యో ఒల్లెంకలో
నేనేంజేతు సొల్లెంకలో
లంగ పాయె ఓణి పాయె ఓ రామ రామ
కంచిపట్టు చీర పాయె ఓ రామ రామ
అడుగు పాయె గొడుగు పాయె ఓ రామ రామ
ఉన్నదంత ఊడ్సక పాయె ఓ రామ రామ
వడ్లు పాయె ఎడ్లు పాయె ఓ రామ రామ
కొంగుకున్న దుడ్లు పాయె ఓ రామ రామ
బండ్లు పాయె గండ్లు పాయె
తుపాకిలో గుండ్లు పాయె
వామ్మో వాయ్యో ఒల్లెంకలో
నేనేంజేతు సొల్లెంకలో
అరె వామ్మో వాయ్యో ఒల్లెంకలో
నేనేంజేతు సొల్లెంకలో
వామ్మో అద్దెడెడ్డే వయ్యో
వామ్మో వయ్యో ఒల్లెంకలో
నేనేం చెద్దు సొల్లెంకలో