• Song:  Vachaadayyo Saami
  • Lyricist:  Ramajogayya Sastry
  • Singers:  Kailash Kher, Divya Kumar

Whatsapp

ముసలి తథా ముడత ముఖం మురిసి పోయెనే గుడిసె పాక గుద్ది దీపం మెరిసిపోయినే రచ్చబండ పక్కనున్న రాములోరి గుళ్లో గంట రంగ రంగ సంబరంగా మొగెనె వచ్చాడయ్యో సామి నింగి సుక్కల్తో గోడుగెత్తింది భూమి ఇచ్చాడయ్యో సామి కొత్త రెక్కల్ని మొలకెత్తించే హామీ (x2) కత్తి సుత్తి పలుగు పారా తీయండి మన కష్టం సుక్కలు కుంకుమ బొట్టుగా పెట్టండి అన్నం బెట్టే పనిముట్లే మన దేవుళ్ళు మరి ఆయుధాల పూజలు చేద్దాం పట్టండి మరి ఆయుధాల పూజలు చేద్దాం పట్టండి అమ్మోరు కన్ను తెరిసిన నవ రాతిరి ఇన్నాళ్ల శిమ్మ సీకటి తెల్లారే సమయం కుదిరి వచ్చాడయ్యో సామి నింగి సుక్కల్తో గోడుగెత్తింది భూమి ఇచ్చాడయ్యో సామి కొత్త రెక్కల్ని మొలకెత్తించే హామీ ఓ మట్టి గోడలు చెబుతాయి సీమ మనుషుల కష్టాలు ఏ దారి గతుకులు చెబుతాయి పల్లె బతుకుల చిత్రాలు పండగొస్తే ప్రతి ఒక్కరి మనసు మరి పెరుగయ్యేది పుట్టి పెరిగిన పల్లె వైపుగా అస్సలైన పండుగ ఎప్పుడంటే ఆ కన్నా తల్లి కంటి నీరు తుడిచినా రోజేగా ఓ నాడు కల కల వెలిగిన రాయలోరి సీమిది ఈనాడు వెలవెల బోతే ప్రాణమంతా చిన్న బోతుంది వచ్చాడయ్యో సామి నింగి సుక్కల్తో గోడుగెత్తింది భూమి ఇచ్చాడయ్యో సామి కొత్త రెక్కల్ని మొలకెత్తించే హామీ ఏ చేతి వృత్తులు నూరారు చేవగలిగిన పని వారు చెమట బొట్టు తడిలోనే తళుక్కుమంటాది ప్రతి ఊరు ఎండ పొద్దుకు వెలిగిపోతారు ఈ అందగాళ్ళు వాన జల్లుకు మెరిసిపోతారు ఎవ్వడు కన్నా తక్కువ పుట్టారు వీళ్ళందిరి లాగే బాగా బతికే హక్కులు ఉన్నోళ్లు పల్లెటూళ్ళు పట్టుకొమ్మలని ఒట్టి జోల పాట పడ్డాకా తల్లడిల్లు తల రాతలకు సాయమేదో చేయాలంటా వచ్చాడయ్యో సామి నింగి సుక్కల్తో గోడుగెత్తింది భూమి ఇచ్చాడయ్యో సామి

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Musali thatha mudatha mukham Murisi poyenee Gudise paaka guddi deepam Merisipoyee Rachabanda pakkanunna ramulori gullo ganta Ranga ranga sambaranga mogene Vachaadayyo saami Ningi sukkaltho godugetthindi bhoomi Ichaadayyo saami Kottha rekkalni molaketthinche haami (x2) Katthi sutthi palugu paara theeyandi Mana kashtam sukkalu Kunkum bottuga pettandi Annam bette panimutle mana devullu Mari aayudhala poojalu cheddham pattandi Mari aayudhala poojalu cheddham pattandi Ammoru kannu therisina nava raathiri Innalla simma seekati thellaare samayam kudiri Vachaadayyo saami Ningi sukkaltho godugetthindi bhoomi Ichaadayyo saami Kottha rekkalni molaketthinche haami O matti godalu chebuthaayi Seema manushula kashtaalu Ye dhaari gathukulu chebuthaayi Palle bathukula chitraalu Pandagosthe prathi okkari manasu Mari parugayyedi putti perigina palle vaipega Assalaina panduga yepudante Aa kanna thalli kanti neeru Thudichina rojegaaa O naadu kala kala veligina raayalori seemidi Eenadu velavela bothe Praanamantha chinna bothundi Vachaadayyo saami Ningi sukkaltho godugetthindi bhoomi Ichaadayyo sami Kottha rekkalni molaketthinche haami Ae chethi vrutthulu nooraru Chevagaligina pani vaaru Chemata bottu thadilone Thalukkumantadi prathi ooru Yenda poddhuki veligipotharu Ee andhagaallu vaana jalluku merisipotharu Evvadi kanna thakkuva puttaru veellandiri laage Baaga bathike hakkulu unnollu Palletoollu pattukommalani Otti jola paata paadakaa Thalladillu thala raathalaku Saayamedho cheyalantaa Vachadayyo saami Ningi sukkaltho godugetthindi bhoomi Ichaadayyo saami

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Bharat Ane Nenu
  • Cast:  Kiara Advani,Mahesh Babu
  • Music Director:  Devi Sri Prasad
  • Year:  2018
  • Label:  Lahari Music Company