కనులకి తెలియని కలలను కంటున్నా
ఇదివరకెరుగని ఉదయము చూస్తున్నా
మంచు మేఘమే ఇలా ఒక గాలి వానలా
మదినే తాకి లోలోన మాయేదొ చేస్తున్నదే
పరిచయమిలా పరిమళములా
మనసునంటి వదలదేలా
తలపులనిలా నిలపడమెలా
యదనుదాటి ఎగిసెనేలా
ఎవరు ఎవరు అని
వివరమడిగె తను ఎవరని ప్రతి దోవా
చివరి వరకు మది
తనను విడువకని అన్నది విన్నావా
అడుగుల్లో తడబాటు తనవల్లేనా
నడిచెళ్ళే ప్రతి చోటూ తన గురుతేనా
తోడయ్యేనా
పరిచయమిలా పరిమళములా
మనసునంటి వదలదేలా
తలపులనిలా నిలపడమెలా
యదనుదాటి ఎగిసెనేలా